ఆశ్రమ లక్ష్యం


తిరుమయిలై శివజ్ఞాన నటరాజస్వామి గారు తాను పొందిన జీవన్ముక్తిని అందరూ పొందుటకు కొన్ని ముఖ్యమైన అనుసరణలను ఏర్పరచారు.

ఇక్కడికి వచ్చేవారు (యోగ విధ్యనభిలషించువారు) ముక్తిని గాక ఏ విషయములోను శ్రద్ధ వహించకూడదని, ముక్తికి ప్రాధమిక విషయమైనటు వంటి యోగ అభ్యాసము చేసి, శరీరము, ప్రాణం, ఆత్మ, పుట్టుట, మరణించుట మొదలగు వాటి రహస్యములను గ్రహించుట కొరకు "యోగం" తప్ప ఏ మార్గములోనైనను గ్రహించలేము అని ఘంటాపథంగా తెల్పియున్నారు. కాబట్టి ముక్తిని పొందుటకు యోగ మార్గమే సరియైనది. జీవన్ముక్తిని పొందుటకు మహర్షులు, మునులు అవలంభించిన, సన్యాస మార్గమునేగాక, గృహస్థాశ్రమమును అవలంభించి, ఉద్యోగమును జేయుచు, భాద్యతను నిర్వర్తించుచు మోక్షమును పొందుటకు ప్రయత్నించవచ్చును. ఎందువలన అనగా జీవితములో ఏర్పడు సుఖదుఃఖములు, మోసపోవడము, ద్రోహం, అవమానం మొదలగు విషయములను అనుభవించునపుడు యోగ అభ్యాసములలోని కొన్ని స్థితులను అధిగమించుటకు ఈ అనుభవములు ఉపయోగపడును.

ఒంటరి తనముతో గాక సమూహముగా ఉండి జీవించచూ ఇష్టాయిష్టములను వదిలి యోగ జీవితమును అనుభవించు నప్పుడు మోక్షమార్గ సాధన లభించును.

ఈ మార్గము అవలంభించు యోగసాధకులందరికీ ముక్తి అంశమును బోధించి, ఈ జీవులందరి అర్హతకు తగినట్లు వారి యోగ స్థితిని అభివృద్ధి పరచుటకు ఈ ఆశ్రమము అన్ని విధముల సహాయపడును. ఇదే ఆశ్రమ లక్ష్యం.