మన సద్గురువులు


శ్రీ రంగనాధ స్వామి గారు:

guru_photo

1975లో శ్రీ శివజ్ఞాన రంగనాధ స్వామిగారు, తిరుమయిలై శివజ్ఞాన నటరాజ స్వామి గారి దగ్గర సాధన ప్రారంభించినారు. శ్రీ రంగనాధ స్వామిగారు నాస్తికవాదిగా యుండెడివారు. అప్పుడు శ్రీ రంగనాధ స్వామి గారితో పని చేసే ఒకరు శ్రీ శివజ్ఞాన నటరాజ స్వామిగారి గురించి తెలిపి వారిని దర్శించమని తెల్పినారు. శ్రీ రంగనాధ స్వామిగారు వెంటనే శ్రీ నటరాజస్వామి గారిని దర్శించి, యోగము యొక్క ప్రారంభము, తుది మొదలగు విషయములను తెలిసికొని తృప్తి చెందిన పిదప, వారు అభ్యాసము చేయు ప్రారంభించినారు. అభ్యసించునపుడు శ్రీ నటరాజ స్వామిగారి గుణములు, క్రియలు, లక్ష్యం మొదలగు విషయములు వారిని గొప్పగా ఆకర్షించినవి. వీరే నిజమైన సద్గురువులు అని గ్రహించి, వారి దగ్గర గౌరవ పూర్వకంగా మసలుకొని అభ్యాసములు నేర్చుకొనుచుండురి.

అప్పుడు అభ్యాస నిలయములో నున్నటి వంటి చాలా మంది నడవడిక నచ్చక, ఆ నిలయము సక్రమముగా నడుపబడుట లేదని గ్రహించి విరమించుకొన్నారు. శ్రీ నటరాజ స్వామి గారు కొన్ని వారములు శ్రీ రంగనాథ స్వామిగారు రావడము లేదని గ్రహించి వారిని తీసుకొని రమ్మని ఒకరిని పంపించినారు. శ్రీ రంగనాథ స్వామి వచ్చి శ్రీ నటరాజ స్వామి దగ్గర అభ్యాస నిలయము యొక్క పని తీరు సక్రమముగా లేదని తెల్పినారు. వారు అప్పుడు “నీకు కావలసినది సాధన. దానిని నేర్చుకో. నేను నీ కొరకు నేర్పించుట లేదు. నీ తర్వాత వచ్చి నేర్చుకొను వారి కొరకు నేర్పించుచున్నాను” అని తెల్పినారు. అటు పిమ్మట శ్రీ రంగనాథ స్వామి గారు అతి శ్రద్ధగా నేర్చుకొనినారు. యోగములో కొన్ని మంచి స్థితులను పొందినారు.

guru_photo

           శ్రీ నెలై రాజ స్వామి గారు.

1987లో శ్రీ శివజ్ఞాన నటరాజ స్వామిగారు సమాధి పొందిన తరువాత, విద్యార్దులందరూ కలిసి ప్రాధమికంగా సమాధిని నిర్మించిరి. తర్వాత కొన్ని కారణముల వలన కొందరు పూర్వ విద్యార్దులు, రావడానికి వీలుకానందున పూర్తి సమాధిని కట్టి, అక్కడ ధ్యాన మండపము నిర్మించుటకు వీలు పడలేదు. అప్పుడు శ్రీ రంగనాథ స్వామిగారు తన సొంత ప్రయత్నముతో సమాధిని నిర్మించి దాని చుట్టూ ధ్యాన మండపము నిర్మించినారు. అప్పుడు కొంతమంది క్రొత్త శిష్య్లులు శ్రీ రంగనాథ స్వామి దగ్గర ఉపదేశము పొందినారు. ఈ విధముగా శ్రీ నటరాజ స్వామిగారి పనులను శ్రీ రంగనాథ స్వామి గారు నిర్విగ్నముగా అక్కడ కొనసాగించుచూ వచ్చినారు. చాలా మంది శ్రీ రంగనాథ స్వామి గారి దగ్గరనే నేర్చుకొనినను, వారిలో తన తరువాత ఈ విద్యను నేర్పించుటకు శ్రీ నేలైరాజ స్వామిగారిని ఎన్నుకొని పూర్తిగా అన్ని అభ్యాసములను నేర్పించి 1998లో శ్రీ రంగనాథ స్వామిగారు సమాధి చెందినారు. తర్వాత శ్రీ నేలై రాజ స్వామిగారు ఈ విద్యను నేర్పించుతూ ఉన్నారు