మన సద్గురువులు


తిరుమయిలై శివజ్ఞాన నటరాజ స్వామి గారు:

Our_guru_photo

తిరుమయిలై శివజ్ఞాన నటరాజ స్వామిగారు ఆ కాలంలో యువకులు నేర్చుకొనేటటువంటి మల్లయుద్ధం, కర్రసాము నేర్చుకొని శరీరమును ధృడంగా కుస్తీదారునిగా ఉంచుకోనిరి. అప్పుడు అయన ఒక సన్యాసిని కలుసుకొనెను. ఆ సన్యాసి ఈ శరీరమును గురించి పరితపించితే చాలదు. అనేక విషయములు ఈ ప్రపంచములో తెలుసుకొనవలసి యున్నవని తెల్పి వెడలెను. .

స్వామిగారికి వెంటనే మనస్సు మారి మరుసటి రోజు ఆ సన్యాసిని వెతికినారు. కానీ ఆయన కనబడలేదు. ఆ రోజు నుండి అయన చాలా మంది సన్యాసులను కలిసినారు. అప్పటి నుండి తన జ్ఞాన జీవితమును ప్రారంభించి, చాలా మంది స్వాములను దర్శించినారు. వారిలో 53 మంది గురువుల దగ్గర ఉపదేశము పొంది తర్వాత చాలా గ్రామములకు, ప్రదేశములకు వెళ్లి యోగాభ్యాసము నేర్చుకోనదలచిన వారికి నేర్పించినారు.

వార్ధక్యము సంప్రాప్తించిన కారణంగా చెన్నై పెరవాళ్ళురులో నివసించుచూ, ఆశ్రమమును నిర్మించి సిద్దయోగ అభ్యాస నిలయమును ఏర్పరిచినారు. తర్వాత విద్యార్దుల కోరిక ప్రకారము దగ్గరలో ఒక చోటును తీసుకొని అక్కడ సమాధి అగుటకు నిశ్చయించినారు. తర్వాత తన దేహమును కాంతి శరీరముగా మార్చుటకు ఒంటరిగా అభ్యాసము చేయుటకు "గుడియాట్టము"నకు దగ్గరగా నున్న అడవికి వెళ్ళినారు. ఈ విషయము తెలిసిన విద్యార్దులు మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించవలయునని ప్రార్దించి, వారిని తీసుకొని వచ్చి పెరవళ్ళురులో గుడి దగ్గర సమాధి ఏర్పరుచుటకు స్థలము కొన్నారు. స్వామి గారిని ఇక్కడే ఉండేటట్లుగా చేసినారు. స్వామిగారు తాను కాంతి శరీరము అవుటకు అడవికి వెళ్లతలచినా, మిగతా వారికి తాను ఒక మార్గదర్శకుడను కావలెను అని, తన శిష్యులకు ఈ అభ్యాసమును నేర్పించవలెను అని సంకల్పించినారు. స్వామిగారు తాను అడవికి వెళ్ళి పలు గురువుల దగ్గర నేర్చుకొన్న ఈ విద్యను, గృహస్థాశ్రమములో ఉన్న తన శిష్యులకు వారికీ నేర్పించవలెననే సదభిప్రాయముతో ఇక్కడే నివసించి, నేర్పించి ఇక్కడనే సమాధి అవ్వవలెనని నిశ్చయించి ఇక్కడనే సమాధి చెందినారు. సమాధి అయిన తరువాత ఈ ప్రదేశము తన ముఖ్య ప్రియ శిష్యడగు శివజ్ఞాన రంగనాధ స్వామి గారి ద్వార అశ్రమముగా వృద్ధి చెందినది..

Next