జ్ఞానయోగ మార్గము


ప్రియమైన ప్రపంచ జీవులందరికి నా నమస్కారం!

ప్రపంచంలో జీవులు కొందరు పుట్టి మరణించెదరు. కొంతమంది విద్య, ధనం, సంపద, కీర్తి, రాజకీయం, విజ్ఞానం, పరిశ్రమలు మొదలగు విషయములలో అనుభవము గడించి అవి ఇతరులకు బోధించి గతించెదరు. మనుష్యుని జీవితంలో గొప్పది, పెద్దది, కీర్తింపదగినది గౌరవింపదగినది జ్ఞాన (ఆత్మసాక్షాత్కార) జీవితము.

అందువలన జ్ఞానులు కొందరు తమ జీవితములోని అనుభవములను ఈ ప్రపంచమునకు తెలియ పరిచియున్నారు. ఇవన్నియు మానవుని జీవితమును, తెలివిని అభివృద్ధి చేయుటకు ఏర్పర్చబడినవి. ఈ విధముగా నేను తెలియపరచు ఈ విషయములు నా స్వానుభవములు. కాబట్టి నేను చెప్పబోయే ఈ విషయములు ఈ ప్రపంచములోని ఏ మతమునకో, ఏ సమూహమునకో, నాగరికతకో వ్యతిరేకమైనవి కావు. ఇవి కేవలము ఆత్మ యొక్క అనుభవము, ఆత్మ రహస్యము అగును. అందరూ దీని గురించి తెలుసుకొనవలెను. ఇంకనూ దీని గురించి బాగా పరిశీలన చేయవలెను. ఇది ఒక్కొక్క జీవుని బాధ్యత అగును. నేను ఈ ఆత్మ రహస్యమును పరిశోధించి, నిజ స్వరూపమును గ్రహించి ఈ ప్రపంచమునకు తెలియపరచుచున్నాను. .

అనేక ఆశీస్సులతో ,

గురు శ్రీ శివజ్ఞాన నెలైరాజ్ స్వామి